ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఏకగ్రీవానికి ప్రయత్నాలు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు ప్రారంభించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నడ్డా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి మద్దతు కూడగట్టాలని వారంతా నిర్ణయించారు.