17న డయల్ యువర్ డీఎం

17న  డయల్ యువర్ డీఎం

CTR: పుంగనూరు ఆర్టీసీ డిపోలో 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమాన్ని ఈనెల 17న గురువారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామని డీఎం సుధాకరయ్య మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సేవలపై సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తమ సలహాలు, సూచనలతో పాటు ఆర్టీసీ సర్వీసులకు సంబంధించి వారికి సమాచారం అందించాలన్నారు.