కెనాల్లో పూడికమట్టి తొలగించాలని ఈఈకి వినతి పత్రం
KNR: ఇల్లందకుంట మండలలోని కెనాల్ కాల్వల్లో పూడిక తొలగించాలని HZB నీటి పారుదల శాఖ అధికారి EE వెంకట్ రాంరెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు రైతు వంగ రామకృష్ణ తెలిపారు. DBM 16 కెనాల్ పరిధిలోని చిన్న కాలువలలో పూడిక వలన చెట్లు పెరిగి యాసంగి పంటకు చివరి ఆయకట్టు వరకు నీరు అందకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, పూడిక పనులు చేపట్టి చెట్లు, మట్టి తొలగించాలన్నారు.