భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు

JN: దేవరుప్పుల మండలంలో ఈరోజు ఉదయం కొత్త ROR చట్టం, భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు ఈ చట్టాలను సద్వినియోపరుచుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రావు, తహశీల్దార్ ఆండాలు, ఎంపిడిఓ లక్ష్మీ నారాయణ, తదితరులున్నారు.