భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే..?

భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే..?

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి హుండీ ఆదాయాన్ని బుధవారం చిత్రకూట మండపంలో లెక్కించారు. గత 29 రోజులకు గాను నగదు రూపంలో రూ. 1,56,91,971 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 71 మి.గ్రా బంగారం,1.280 కిలోల వెండి సమకూరింది. అమెరికా, మలేషియా, సింగపూర్ సహా పలు దేశాల విదేశీ కరెన్సీని సైతం భక్తులు మొక్కుగా చెల్లించారు అని అధికారులు తెలిపారు.