నేడు నామినేషన్ వేయనున్న బీఎస్పీ అభ్యర్థి

నాగర్ కర్నూల్: బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం గురువారం నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని పార్టీ జిల్లా అధ్యక్షులు బండి పృథ్వీ రాజు తెలిపారు. కొల్లాపూర్ చౌరస్తాలోని పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.