సూపరింటెండెంట్ ఇందిరాదేవి చర్యలు నిలుపుదల..!
కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవి 2024 డిసెంబర్‌లో ముఖ గుర్తింపు హాజరులో అవకతవకలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై గతంలో చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. దాన్ని తాజాగా నిలుపుదల చేస్తూ సంబంధిత శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అధికారులు విచారించి చర్యలకు ఆదేశించగా ఇందిరాదేవి సమాధానం ఇచ్చారు.