యాదాద్రి దేవస్థాన పరిసరాల్లో పర్యటించిన ఆలయ ఈవో

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు ఈనెల 5న సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆలయ ఈవో వెంకట్రావు టెంపుల్ సిటీలో వేద పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అలాగే కొండ కింద గల నూతన నిత్య అన్నదాన సత్రం భవనం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.