సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్
SRD: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆమె వినతులు స్వీకరించారు. అర్జీదారుల నుంచి అందిన దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేకర్, మాధురి తదితరులు పాల్గొన్నారు.