'రైతన్న మీకోసం' కార్యక్రమం
KDP: కలసపాడు మండలంలోని చెన్నుపల్లె గ్రామ పంచాయతీలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ ఇంఛార్జ్ రితేష్ రెడ్డి హాజరై రైతులతో ముచ్చటించారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.