ఎడపల్లి పాఠశాలలో ఒడిస్సీ నృత్య ప్రదర్శన

ఎడపల్లి పాఠశాలలో ఒడిస్సీ నృత్య ప్రదర్శన

NZB: భారతీయ శాస్త్రీయ సంగీతం, సంస్కృతిని యువతకు చేరువ చేయడమే లక్ష్యమని ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి ప్రగ్యా ఘోష్ అన్నారు. ఎడపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఒడిస్సీ నృత్య ప్రదర్శన వైభవంగా జరిగింది. తన ప్రదర్శనతో విద్యార్థులను, ఉపాధ్యాయులను అలరించారు. ఒడిస్సీ నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడమే తమ లక్ష్యమన్నారు.