జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఉష ఎంపిక
KMR: జాతీయస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 బాలికల కబడ్డీ పోటీలకు పేట్సంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బానోత్ ఉష ఎంపికైనట్లు హెచ్ఎం కుమార స్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గుడివెనక తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ విఠల్, మంగతిబాయి రెండో కూతురు ఉష జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.