తండ్రిని చంపిన ఇద్దరు కుమారులు
BHPL: జిల్లా రేగొండలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తండ్రిని కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. రేపాకలో ఒంటరిగా ఉంటున్న చేరాలను, గ్రామానికి వచ్చిన అతని కొడుకులు మరో మహిళతో ఉండటాన్ని గమనించి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలైన చేరాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.