గురుకుల పాఠశాలల పనితీరుపై కలెక్టర్ సమీక్ష సమావేశం

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నేడు కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన గురుకుల ఆశ్రమ పాఠశాలల పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు కస్తూరిబా పాఠశాలల పనితీరుపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.