తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసింది: మంత్రి

తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసింది: మంత్రి

కోనసీమ: శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట కడు విషాదకరం అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది అన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి సుభాష్ సంతాపం తెలిపారు.