భక్తాంజనేయ స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

భక్తాంజనేయ స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి, చిట్యాల గ్రామాలలో నిర్వహిస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వామి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శనివారం పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో కలసి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, BLR బ్రదర్స్ పాల్గొన్నారు.