బండలాగుడు పోటీల్లో గెలిచింది వీరే..

బండలాగుడు పోటీల్లో గెలిచింది వీరే..

ప్రకాశం: కొమరోలు మండలంలో మాధవనిపల్లిలో శనివారం సీతారామ కళ్యాణం మహోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 18జతల ఎడ్లు పాల్గొన్నాయి. నంద్యాల జిల్లా గడిగరేవుల గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ ఎడ్లు 3200 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.30వేల నగదు బహుమతిని గెలుచుకున్నారు. రెండో బహుమతి రూ.20వేలు నాగేశ్వరరావు గెలిచారు.