పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన
RR: ఇవాళ సీపీఎం పార్టీ, సీఐటీయూ ఆధ్వర్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. సీపీఎం పార్టీ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ.. నిత్యవసర వస్తువులు ఇప్పటికే ఆకాశానంటాయని, గ్యాస్ ధర పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.