అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన

కోనసీమ: కాట్రేనికోన గేట్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌పై పార్లమెంటులో అమిత్ షా వ్యాఖ్యాలను ఖండిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండు బాబు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి విగ్రహానికి పూలమాలలు వేశారు.