MLA ఆదేశాలతో నీరును తొలగించిన మున్సిపల్ సిబ్బంది
WGL: తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నర్సంపేట పట్టణంలోని కార్ల్ మార్క్స్ కాలనీలో వర్షపు నీరు నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది శనివారం చర్యలు చేపట్టారు. అడ్డుగా ఉన్న పైపులను జేసీబీ సాయంతో తొలగించి నీరు వెళ్లేలా చేశారు.