‘తేజస్ సేఫ్.. ఆ ప్రమాదంతో ఫ్యూచర్‌కి ఢోకా లేదు’

‘తేజస్ సేఫ్.. ఆ ప్రమాదంతో ఫ్యూచర్‌కి ఢోకా లేదు’

దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన ఫైటర్ జెట్ తేజస్ ప్రమాదంపై HAL ఛైర్మన్ డీకే సునీల్ క్లారిటీ ఇచ్చారు. తేజస్ పూర్తిగా సురక్షితమని, దీని సేఫ్టీ రికార్డ్ ప్రపంచంలోనే బెస్ట్ అని భరోసా ఇచ్చారు. దుబాయ్‌లో జరిగింది దురదృష్టకర సంఘటనే తప్ప, ఫ్లైట్ లోపం కాదని స్పష్టం చేశారు. ఆ ఒక్క ఘటనతో తేజస్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడదని తేల్చిచెప్పారు.