మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ

మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ

VKB: శాంతి భద్రతే తొలి ప్రాధాన్యమని, మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నూతన ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా సమర్థవంతంగా విధులు నిర్వహించిన స్నేహ మెహ్రా శనివారం నూతన ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల భద్రతకు, రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.