మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా శ్రీ శుద్ధ హావనము

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రీ శుద్ధ హావనము కార్యక్రమము ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మహిళా భక్తులు ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుండి ఆలయం భక్తులతో సందడిగా మారింది.