VIDEO: వేతన సవరణ చేపట్టాలని ధర్నా
JGL: మెట్‌పల్లి విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. 2026 వేతన సవరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టిసన్ కార్మికుల విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, 2016 నాటికి అర్హతలు ఉన్నప్పటికీ ఆర్టిజనులుగా విలీనం కాని కార్మికులను వెంటనే గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.