ఈ రికార్డులు చంద్రబాబుకే సాధ్యం: జగన్

AP: పంటలకు ధరల పతనంలో కూటమి ప్రభుత్వం సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు అని జగన్ Xలో పోస్టు చేశారు. 'కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా కనికరం కూడా చూపడంలేదు కదా? రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?' అంటూ పేర్కొన్నారు.