VIDEO: సైలాని బాబా దర్గా వరకు సందల్ ర్యాలీ
NZB: రెంజల్ మండలం నీల గ్రామం నుంచి సైలానీ బాబా దర్గా వరకు ఆదివారం భక్తులు భారీ సందల్ ర్యాలీ నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా వస్తున్న ఈ వేడుకలో డప్పు చప్పుళ్లు, ఆధ్యాత్మిక నినాదాలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలిరావడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది.