పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసిన ఎస్పీ

పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసిన ఎస్పీ

కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నిన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో ఆంధ్ర సాధనకు 58 రోజుల కటోర దీక్షను చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.