మృతుడి కుటుంబానికి చెక్కు అందజేత

మృతుడి కుటుంబానికి చెక్కు అందజేత

W.G: ఆకివీడు మండలం మాదివాడకు చెందిన జనసేన కార్యకర్త బల్ల వేణు వర్ధన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జనసేన ప్రమాద బీమా పథకం కింద అతడి కుటుంబానికి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని ఉండి నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ జుత్తుగ నాగరాజు, ముత్యాల రత్నం, ఆకివీడు పట్టణ అధ్యక్షుడు పిల్లా బాబు మృతుడి తండ్రి నాగ శ్రీనివాస్‌కి అందజేశారు.