'వైసీపీ నాటకాలను ప్రజలు నమ్మరు'

CTR: టీటీడీ గురించి మాట్లాడే నైతికత వైసీపీకి కానీ, కరుణాకర్ రెడ్డికి గాని లేదని యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్ గురువారం స్పష్టంచేశారు. టీడీపీ ఎల్లప్పుడూ తిరుమల పవిత్రతను కాపాడిందని, వైసీపీ హయాంలో నాసిరకం సరుకులతో అన్నప్రసాదం, రూ.1600 కోట్ల దోపిడీ, టిక్కెట్ల కుంభకోణాలతో స్వామివారి ప్రతిష్ఠను దిగజార్చారని ఆరోపించారు.