పుట్లూరు మండలంలో వరుస చోరీలు
ATP: పుట్లూరు మండలంలో వ్యవసాయ పొలాల వద్ద వరుసగా విద్యుత్ కేబుల్ చోరీలు జరుగుతుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా పి.చింతలపల్లి గ్రామంలో పబ్లిక్ మోటర్‌తో పాటు సర్పంచ్ రామకృష్ణారెడ్డికి చెందిన కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గత కొద్ది రోజులుగా మండలంలో ఈ దొంగతనాలు నిరంతరం కొనసాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.