ఒకేషనల్ కోర్సులో విద్యార్థులకు శిక్షణ
AKP: నక్కపల్లి మండలం వేంపాడు జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒకేషనల్ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు హెచ్ఎం వరలక్ష్మి తెలిపారు. పది రోజులు పాటు ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్ విభాగాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రివైండింగ్ రిపేరింగ్ షాప్స్‌కు తీసుకువెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.