గిరిజన బాలికల హాస్టల్‌లో న్యాయ అవగాహన సదస్సు

గిరిజన బాలికల హాస్టల్‌లో న్యాయ అవగాహన సదస్సు

MLG: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. లాయర్ మేకల మహేందర్ పాల్గొని రాజ్యాంగ హక్కులు, చట్టాలపై వివరించారు. విద్యాహక్కు, బాల్య వివాహనిరోధక, పొక్సో వంటి చట్టాలపై, టోల్ ఫ్రీ నంబర్ 15100పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.