ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు

ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు

KNR: జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని గ్రామ పాలకమండలి సభ్యులు తహసీల్దార్ వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారు. స్మశానవాటిక వద్ద 2 ఎకరాలు, బతుకమ్మ కుంట వద్ద 5 ఎకరాల భూమి ఆక్రమించారని తెలిపారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరగా, సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని రక్షిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.