స్థానిక పోరు.. సర్పంచ్ బరిలో ఎన్‌ఆర్ఐ
TG: నాగర్‌కర్నూల్ జిల్లా లట్టుపల్లి పంచాయతీకి NRI నామినేషన్ దాఖలు చేశారు. గ్రామానికి చెందిన కమతం నందిని, శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఆరేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. వారికి ముగ్గురు పిల్లలు ఉండటంతో నిరాశ చెందారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో వారు అమెరికా నుంచి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాతీర్పుపైనే తన భవితవ్యం ఉందని నందిని పేర్కొన్నారు.