ఈనెల 26న భీమ్ ఆర్మీ ర్యాలీ

ఈనెల 26న భీమ్ ఆర్మీ ర్యాలీ

GDWL: రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్‌ఛార్జి మాచర్ల ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలో కార్యకర్త సమావేశంలో ఇవాళ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో భీమ్ ఆర్మీ భారీ ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు.