'వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు'
VZM: వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్ర యాప్‌ల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ పోర్టికో వద్ద ఏర్పాటు చేసిన వాట్సాప్ డిస్‌ప్లే స్కానర్ స్టాండ్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. ప్రజల చేతిలోనే ప్రభుత్వం అనే లక్ష్యంతో సుమారు 300 రకాల ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు.