జిల్లాలో మొదలైన చలి
NLG: జిల్లాతో పాటు శివారు ప్రాంతాల్లో చలి మొదలైంది. కార్తీక మాసం ఆరంభంతో చల్లటి గాలుల తీవ్రత నెమ్మదిగా పెరుగుతోంది. పగటి సమయం తగ్గి, సాయంత్రం ఆరు గంటలకే సూర్యాస్తమయం అవుతోంది. చలి నుంచి రక్షణ కోసం ప్రజలు స్వెటర్లు, రగ్గులు సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల చలి మంటలు కూడా వేస్తున్నారు.