ప్లాస్టిక్ వినియోగంపై ఆకస్మిక దాడులు
NLG: పట్టణ మున్సిపాలిటీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే. కొందరరు నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నారు. దీనిపై సమాచారం మున్సిపల్ అధికారులు పలు షాప్‌లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీంట్లో ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని, రూ. 12,000 జరిమానా విధించారు.