ప్రారంభంకాని యాదగిరిగుట్ట వైద్య కళాశాల పనులు
BHNG: యాదగిరిగుట్ట వైద్య కళాశాల శాశ్వత భవనం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా లేదు. స్థలం కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులను మాత్రం విస్మరించింది. గుట్టలోనే నూతన వైద్య కళాశాల భవనం నిర్మించి ఈ విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి, ఆలేరు ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అటకెక్కిందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.