పోలీసుల మెరుపు దాడి.. రౌడీ షీటర్లకు షాక్
TG: హైదరాబాద్‌లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నగరవ్యాప్తంగా 1300 మంది రౌడీ షీటర్లను గుర్తించి, 250 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 190 మంది గంజాయి వాడుతున్నట్లు తేలింది. ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? దీని వెనుక ఉన్న ముఠాలెవరు? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.