పవర్ ప్లాంట్‌లో సమస్య.. విద్యుత్‌కు బ్రేక్

పవర్ ప్లాంట్‌లో సమస్య.. విద్యుత్‌కు బ్రేక్

BHPL: గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో సోమవారం సాంకేతిక లోపం చోటుచేసుకుంది. బాయిలర్ ట్యూబ్స్‌లో లీకేజీ కారణంగా 2వ దశలో ఉత్పత్తి అవుతున్న 600 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన అధికారులు వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. త్వరితగతిన లోపాన్ని సరిచేసి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.