కుక్కల బెడద ...భయాందోలనలో స్థానికులు
ADB: బేల మండల కేంద్రంలో రోడ్డుపై నిత్యం కుక్కలు గుంపులుగా ఉండి వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బందిగా మారింది. కొన్ని చోట్ల కుక్కలు వెంట పడి తరుముతూండడంతో వాటి నుంచి తప్పించే క్రమంలో ప్రమాద బారిన పడుతున్నామని వాహణదారులు వాపోతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో కుక్కల బెడద లేకుండా చేయాలని కోరుతున్నారు.