అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం..!

అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం..!

అన్నమయ్య: మదనపల్లి పుంగనూరు రోడ్డులోని ఖాజాపూర్‌లో ఉన్న లారీ బాడీ బిల్డర్ షెడ్‌లో శుక్రవారం అగ్నిప్రమాదంలో సుమారు రు.1.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.