VIDEO: 'అర్బన్ పాఠశాలను తరలించొద్దని బీజేపీ నిరసన'

BHNG: జిల్లా కేంద్రంలోని అర్బన్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అన్ని వసతులు కలిగిన జిల్లా కేంద్రంలోని పాఠశాలను ఇతర ప్రాంతానికి తరలిస్తే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని హెచ్చరించారు. పాఠశాలను తరలించే నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు.