యూటీఎఫ్ నిరాహార దీక్ష
ASR: పాడేరు ఐటీడీఏ వద్ద యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీలక్ష్మి దీక్షను ప్రారంభించి సూపర్-6 డిమాండ్స్‌ను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ ఛైర్మన్ నియామకం, బకాయిల చెల్లింపు, ఓపీఎస్ అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. అనంతరం రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.