'ప్రతి వీధి దీపం వెలగాల్సిందే'
SRD: ప్రతి వీధి దీపం వెలగాల్సిందేనని క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పటాన్ చెరు క్యాంపు కార్యాలయంలో GHMC విద్యుత్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బల్దియా పరిధిలోని 3 డివిజన్లలో విద్యుత్ స్తంభాలు, లైట్ల పనితీరుపై సమీక్షించారు.