'స్నేహపూర్వక వాతావరణంలో పండగ జరుపాలి'

MBNR: యువత భక్తి మార్గంలో పయనిస్తే చెడు దారిన వెల్లరని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాబోయే వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వినాయక మండపంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. స్నేహపూర్వక వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలన్నారు.