వరద నీటిలో కొట్టుకొచ్చిన అరుదైన అలుగు

వరద నీటిలో కొట్టుకొచ్చిన అరుదైన అలుగు

అనకాపల్లి: ఎలమంచిలిలో వరద నీటిలో అరుదైన అలుగు ఆదివారం రాత్రి కొట్టుకొచ్చింది. దీనిని భారతీయ అలుగు ఇండియన్ పాంగోలిన్‌గా పిలుస్తారు. ఎలమంచిలి మండలం పెద్దపల్లి రిజర్వు ప్రాంతం నుంచి వరదలకు కొట్టుకొచ్చినట్లుగా స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దేశంలో అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన అలుగుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు.