చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం: ఎమ్మెల్యే

చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం: ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీరు అందించేందుకు పట్టణంలో పలు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చలివేంద్రం నిర్వహకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.