ఫిరంగిపురంలో వాహనాల తనిఖీలు

ఫిరంగిపురంలో వాహనాల తనిఖీలు

GNTR: ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వాహనాలను, హెల్మెట్ ధరించని, పత్రాలు లేని వాహనదారులను గుర్తించి చలానాలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు వెల్లడించారు.